Monday, December 23, 2024

27న రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో ఈ నెల 27న సొమ్ము జమకానుంది. ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 13వ కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తారు.

అర్హులైన రైతుల ఖాతాలో ఆయన డబ్బులను జమ చేస్తారు. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. కిసాన్ సమ్మాన్ నిధి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ వాయిదాకు అర్హులా కాదా అని తెలిసిపోతుంది. రైతులు ఇకెవైసి చేయకుంటే పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News