Monday, December 23, 2024

హరహరా..!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్/: ప్రేమించిన యువతి కోసం ప్రాణ స్నేహితుడిని మరో యువకుడు అత్యంతకి రాతకంగా హత్య చేసిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోపంతో స్నేహితుడి గొంతు, మ ర్మాంగాలను, తల, మొండెం వేరుచేసి, చేతి వేలు, గుండెను చీల్చి దారుణంగా హతమార్చాడు. తర్వాత మృతదేహాన్ని విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప క్కన పడేశాడు. హైదరాబాద్ నగర శివారు లో జరిగిన ఈ హత్య సంచలనంగా మారిం ది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (22) న ల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఈ సమయంలో ముసారాంబాగ్‌లో ఉండే హరిహర కృష ్ణ(21)తో స్నేహం ఏర్పడింది. ఇద్దరు ప్రాణస్నేహితులుగా కలిసి ఉండేవారు.

ఈ సమయంలోనే నవీన్ వారి కాలేజీకి సమీపంలోని వేరే కాలేజీలో చదువుతున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఇం టర్ చదివే సమయంలో నగరంలో తిరిగేవా రు. ఈ క్రమంలోనే నవీన్‌కు ఇంజినీరింగ్ సీటు రావడంతో నల్గొండకు వెళ్లిపోయాడు. అయినా ఇద్దరు తరచూ సోషల్ మీడియా లో చాటింగ్ చేసుకునేవారు. తనను చూసేందుకు రావాలని యువతి తరచూ నవీన్‌కు మెసేజ్‌లు పెట్టేదని తెలిసింది. నవీన్ ప్రేమించిన యువతి హరిహరకృష్ణకు కూడా తెలియడంతో ఇద్దరు గత కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. నవీన్‌ను వదిలేసి హరిహర కృష్ణను ప్రేమిస్తున్నట్లు తెలిసింది. అరోరా కళాశాలలో బి.టెక్ నాలుగో సంవత్సరం చదువుతుండడంతో యువతి, హరిహరకృష్ణ తరచూ కలుసుకునే వారని తె లిసింది. కాగా ఈ విషయం నవీన్‌కు తెలియడంతో సోషల్ మీడియా ఒక యువతి ఒ కరినే ప్రేమించాలని, ఇద్దరిని ప్రేమించకూడదని పోస్టింగ్‌లు పెట్టేవాడని నవీన్ స్నేహితులు తెలిపారు. అంతేకాకుండా నవీన్ యువతికి మెసేజ్‌లు చేసేవాడని, వాటిని యువతి హరిహరకృష్ణకు చూపించేదని తెలిసింది. ఈ క్రమంలోనే నవీన్ ఇంజనీరింగ్ పూర్తి కావస్తుండడంతో నగరానికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

నవీన్ దిల్‌సుఖ్‌నగర్‌కు వస్తే తనకు ప్రేమించిన యువతి దూరం అవుతుందని హరిహరకృష్ణ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ హత్య చేయాలని ప్లాన్ వేసుకున్న నిందితుడు ఈ నెల 17న నవీన్‌కు గేట్ టూ గేదర్ ఉంది రావాలని ఫోన్ చేసి చెప్పాడు. హత్య ప్లాన్ విషయం తెలియని నవీన్ నగరానికి వచ్చాడు. ఇద్దరు కలిసి హరిహరకృష్ణ ఇంటిలో పార్టీ చేసుకున్నారు. ఇద్దరి మధ్య అక్కడే గొడవ జరిగినట్లు తెలిసింది. తర్వాత ఇద్దరు కలిసి అదే రాత్రి పెద్ద అంబర్‌పేట్ ఔటర్ సమీపంలోని రామాదేవి పబ్లిక్ స్కూల్‌కు వెళ్లే దారిలో బైక్‌పై వెళ్లారు. అక్కడకి వెళ్లిన తర్వాత హరిహరకృష్ట , నవీన్ మధ్య యువతి విషయంపై మళ్లీ గొడవ జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో నవీన్ కిందపడడంతో గొందునులిమి హత్య చేశాడు. తర్వాత కత్తితో గోంతు కోసి తల, మొండం వేరు చేశాడు. మర్మాగం కోసిన అనంతరం గుండెను చీల్చి, పేగులను బయటికి తీశాడు. తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశాడు. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి హయత్‌నగర్ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నిందితుడికి 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై 302,201,5(2)(వి),ఎస్‌సి,ఎస్‌టి, పిఓఏ యాక్ట్ 2015 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు నిందితుడిని తీసుకుని వెళ్లి సంఘటన స్థలంలో సీన్‌రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలిసింది.

ఫోన్ స్విచ్ ఆఫ్‌తో.. స్నేహితుల కలవరం

ఇంటర్ గేట్ టూ గేదర్ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన నవీన్ తిరిగి రాకపోవడంతో స్నేహితులు అదే రాత్రి 8.20 గంటలకు ఫోన్ చేస్తే మాట్లాడారు. తర్వాత 9 గంటల మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌గా వచ్చిందని తెలిపారు. దీంతో తిరిగి ఈ నెల 18న ఫోన్ చేస్తే కలవ లేదు. వెంటనే నవీన్ బంధువులకు ఫోన్‌చేసి ఆచూకీపై ఆరా తీశారు. వారు చెప్పలేకపోవడంతో నవీన్ స్నేహితురాలికి వాట్సాప్ ద్వారా నవీన్ గురించి అడిగారు. తనకు తెలియదు 17న రాత్రి 11 గంటలకు హరిహరకృష్ణ ఫోన్ నుంచి కాల్ చేశాడని చెప్పింది, అతడి నంబర్ పంపించడంతో వెంటనే హరిహరకృష్ణకు నవీన్ స్నేహుతులు ఫోన్ చేయడంతో తనకు నవీన్‌కు గొడవ జరిగిందని, పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వదిలి ఇంటికి వెళ్లిపోయానని సమాధానం చెప్పాడు. ఈ విషయం యూనివర్సిటీ స్నేహితులు నవీన్ తండ్రికి చెప్పారు. వెంటనే నవీన్ తండ్రి శంకర్ నాయక్, హరికి ఫోన్ చేసి అడుగగా అదే విధంగా సమాధానం ఇచ్చాడు. కావాలంటే తాను ఈ నెల 21వ తేదీన పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వస్తానని నవీన్ వదిలేసిన ప్రాంతాన్ని చూపిస్తానని చెప్పాడు. తీరా అక్కడి నవీన్ బంధువులు రాగా హరిహర కృష్ణ అక్కడికి రాకుండా ఫొన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. వెంటనే హరిహరకృష్ణ పై అనుమానం వచ్చి నవీన్ కుటుంబ సభ్యులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం తెలిపారు. నవీన్ ఎక్కడ నుండి వెళ్లాడో అక్కడే మిస్సింగ్ కేసు పెట్టాలని పోలీసులు చెప్పారు. దీంతో నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నవీన్‌ను కనిపించటం లేదని తండ్రి శంకరయ్య ఫిర్యాదు చేశారు. దీంతో నార్కట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ శివరామిరెడ్డి హరిహరకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతడి తల్లిదండ్రులను పిలిచి విచారణ చేశారు.

ఒత్తిడిని తట్టుకోలేక.. లొంగుబాటు

ఈ నెల 21 నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసిన హరిహరకృష్ణ అజ్ఙాతంలోకి వెళ్లాడంతో మలక్‌పేట్‌లో అతడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. కుటుంబ సభ్యులు, పోలీసుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఈ నెల 24న రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో హరిహరకృష్ణ లొంగిపోయాడు. తన స్నేహితుడు నవీన్‌ను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. తాను ప్రేమించే యువతి కోసం నవీన్‌ను హత్య చేశానని, మూడు నేలల నుంచే హత్య చేసేందుకు ప్లాన్ వేశానని తెలిపాడు. ఓ షాపింగ్ మాల్‌లో రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశానని, దానిని స్కూటీలో పెట్టుకుని తిరిగానని చెప్పాడు. వెంటనే పోలీసులు నిందితుడిని తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నవీన్ మృతదేహం పూర్తిగా కూళ్లిపోయింది. శరీర భాగాలు గుండె తల, మొండెం, చేతి వేలు, మర్మాంగలు కత్తితో కోసి ఉన్నాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ, వనస్థలిపురం ఏసిపి పురుషోత్తంరెడ్డి, సిఐ వాసం స్వామితో కలిసి సంఘన స్థలం పరిశీలించి, హత్య ఘటన పై వివరాలు సేకరించారు.

బంధువుల ఆందోళన…

హత్య విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నవీన్ కుటంబానికి న్యాయం చేయాలని స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు భారీగా మొహరించి ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేసి ఇతర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన స్నేహితుడి హత్య విషయం తెలిసిన యూనివర్శిటీ విద్యార్ధులు, చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు.

యువతికి ఫొటోలు..?

కాగా హంతకుడు హరిహరకృష్ణ నవీన్‌ను చంపిన తర్వాత కత్తితో కోసిన గుండెను, తల, మొండం, చేతి వేలు, మర్మాంగాల ఫొటోలు తీసి తాను ప్రేమిస్తున్న యువతికి వాట్సాప్ ద్వారా షేర్ చేసిన్నట్లు ప్రచారం జరుగుతుండంటంతో, ఇదే విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారని తెలిసింది. నవీన్ హత్య కేసులో యువతి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన ఫొటోలు హరిహరకృష్ణ పంపితే పోలీసులకు యువతి ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతుంది.

యువతి పాత్రపై విచారణ : సాయిశ్రీ,ఎల్‌బి నగర్ డిసిపి

నవీన్ హత్య కేసులో యువతి పాత్రపై విచారణ చేస్తున్నామని ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో విచారణ చేస్తున్నామని, హత్యలో ఎవరెవరు పాల్గొన్నారో తేలాల్సి ఉందని అన్నారు. హత్య ఒక పథకం ప్రకారం చేశారని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News