Saturday, December 21, 2024

సిబిఐ ఎదుట హాజరైన సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలజీ కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఆదివారం సిబిఐ రెండో రౌండ్ ప్రశ్నించడం ప్రారంభించింది. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం సిసోడియా భారీ బారికేడ్లతో కూడిన సిబిఐ కార్యాలయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో నంబర్ వన్ నిందితుడిగా సిబిఐ అభియోగం మోపింది. ఇదివరకు అక్టోబర్ 17న సిసోడియాను ప్రశ్నించడం జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తును ఓపెన్‌గా ఉంచినందున సిసోడియా పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చలేదు.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన పలు అంశాలు, మద్యం వ్యాపారులతో ఆయనకున్న ఆరోపణలు, రాజకీయ నాయకులు, సాక్షులు తమ వాంగ్మూలాల్లో చేసిన ఆరోపణలపై సిసోడియాను సిబిఐ ప్రశ్నించింది. సిసోడియా సన్నిహిత సహచరుడు దినేశ్ అరోరా ఒప్పుకోలు ప్రకటనలతో , ‘సౌత్ లాబీ’ సభ్యులను ప్రశ్నించి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నించింది. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం లంచం ఇచ్చిన కొంతమంది డీలర్లుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణ ఉంది. దీనిని ‘ఆప్’ గట్టిగా ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News