కరీంనగర్: చారిత్రాత్మకంగా ఘనమైన చరిత్రగల కరీంనగర్ జిల్లాలో పర్యాటక శోభను సంతరించుకునేలా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ తో ప్రపంచస్థాయిలో అద్బుతమైన టూరిజం స్పాట్ గా జిల్లా మారనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం మానేరు రివర్ ఫ్రంట్ లో రూ.69 కోట్లతో బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటెన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ ను ఆనుకుని ఉన్న 24 టీయంసిల వాటర్ బాడిని పర్యాటకంగా అభివృద్ది చేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆకాంక్ష మేరకు ఆహ్మాదాబాద్ లోని సబర్మతిని మించి మానేరు రివిర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఒక్కప్పుడు చికెన్ కబేళా, చెత్తాచెదారంతో మురికి కూపంగా మారి ముక్కుముసుకుని వెళ్లె దుస్థితిలొ ఉన్న మానేరు పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేసి అభ్బుతమైన పర్యాటక ప్రాంతాంగా తీర్చిదిద్దేలా రూ.410 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేయడంతో మానేరురివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో రూ.310 కోట్లు ఇరిగేషన్ శాఖ ద్వారా కన్షక్షన్ ఆఫ్ రిటర్నింగ్ వాల్స్ మరో రూ.100 కోట్లతో పర్యాటక శాఖ ద్వారా యాక్టివిటి కొరకు మంజూరు చేయడం జరిగిందని పేర్కోన్నారు.
ఇప్పటికే ఆర్ అండ్ బీ ద్వారా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేసుకొని డైనమిక్ లైటింగ్ ను ఏర్పాటు చేసుకోబుతున్నామని అన్నారు. 3.7 కిలోమిటర్లతో మానేరుకు ఇరువైనపుల అభివృద్ది పనులను చేపట్టడంతో పాటు చెక్ డ్యాం నిర్మాణం కుడా చేసుకోవడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ నగరానికి కొత్త ఓరవడిని సృష్టించేలా ప్రపంచం మొత్తంలో సియోల్, చైనాలో నడుస్తున్న బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటెన్ ను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోని కరీంనగర్ నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ లో రూ.69 కోట్లతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ఫౌంటెన్ లో వాటర్ జట్స్, ఫయిర్ జట్స్, లేజర్ షో మరియు నీటిదారాతో ఎర్పడే ప్రోజెక్టర్ ఉంటాయని తెలిపారు. వెయి కెపాసిటితో ఆంపిథియెటర్ ను నిర్మించుకోనున్నామని, బిగ్ ఓ పైబాగంలో 1600 జెట్లు (నాజల్స్) అన్ని ఒకే సారి పనిచేయడంతో ఆ నీటిదాటికి ష్కీన్ ఏర్పడుతుందని, క్రిందిబాగంలో మరో 500 నాజల్స్ ఉంటాయని తెలిపారు.
ఈ వాటర్ ప్రోజెక్టర్ స్కీన్ ద్వారా సుమారుగా 1కి.మి నుండి అర కిలో మీటరు దూరం వరకు స్పష్టంగా చూడగలని, దీనిద్వారా 20 నుండి 25 నిమిషాల నిడివిగల చిత్రాలాను ప్రదర్శించుకోగలుగుతామని, ప్రత్యేక సందర్బాలలో మరికొంత సమయాన్ని కూడా పెంచుకోని లఘచిత్రాలను చుడగలమని తెలిపారు. గతంలో నీటిపై ఉండే వాటర్ ఫౌంటెన్లను చూసామని, ఇప్పుడు ఏర్పాటు చేయబోయో వాటర్ ఫౌంటెన్ నీళ్లపై, నీటినుండి 140 ఫీట్ల ఎత్తులో ప్రదర్శించగలదని తెలిపారు.
బిగ్ ఓ లో ఫైర్ 24 ఫైర్ నాజల్ జెట్స్ ఉంటాయని, 72 ఫైర్ జెట్స్ ఉంటాయిని తెలిపారు. హైదరాబాద్ తరువాత పప్రంచస్థాయి పర్యాటకులు కరీంనగర్ కు వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనిని 7 నుండి 8 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోగలుగుతామని, ఫౌoటెన్ ను జూన్ 2న ప్రారంభిస్తామని తెలిపారు. మానేరులో 30 కోట్లతో బారతదేశంలోనె మొదటి సారిగా క్రూయిజ్ బోటింగ్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పనులను పూర్తిచేసుకొని మొదటిదశ పనులను పూర్తిచేసుకోని అగస్టు నాటికి ప్రారంభించుకోవడానికి సిద్దంగా ఉన్నామని, రెండవ దశ పనులను త్వరలో పూర్తిచేసుకోవడం జరుగుతుందని తెలిపారు.