- Advertisement -
హైదరాబాద్: కెసిఆర్ సర్కార్ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని, కెసిఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడిందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు.
“బిజెపిపై ఎన్ని విమర్శలు చేస్తే అంత ఆశీర్వాదం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హామీలను విస్మరించింది. దళితబంధు, దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయి. కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ అభివృద్దికి ప్రధాని మోడీ పెద్ద మనస్సుతో సహాకరిస్తున్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది. ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రానికి దక్కలేదు. బిఆర్ఎస్ కు జాతీయ అధక్ష్యుడు ఎవరో చెప్పాలి. బీఆర్ఎస్ ను ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గర్ లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉంది” అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
- Advertisement -