Monday, November 18, 2024

కొత్త కాంగ్రెస్‌కు ఇది ఆరంభం: మల్లికార్జున ఖర్గే

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం అన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, సంకల్పం పార్టీకి అవసరమని ఖర్గే తెలిపారు. పార్టీ 85వ ప్లీనరీ సెషన్ ముగింపు సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఈ సెషన్ పూర్తవ్వచ్చు కానీ కొత్త కాంగ్రెస్‌కు ఇది ఆరంభంగా పేర్కొన్నారు. మనముందు ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానిక ఐక్యత, సంకల్పం అవసరమని, పార్టీ బలంపైనే మన బలం ఆధారపడి ఉందన్నారు.

జాతీయ స్థాయిలో మన ప్రవర్తన ప్రతిస్థాయిలోని కోట్లాదిమంది పార్టీ సహచరులపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. కాలంతోపాటు విషయాల్లో మార్పులు వస్తాయి. ప్రజల ఆశలు, అంచనాలు మారతాయి. సవాళ్లు ఎదురవుతాయి. కానీ కొత్త దారులు కూడా వెలుగులోకి వస్తాయి. అందుకే రాజకీయ, సామాజిక సేవల బాటకు ముగింపు ఉండదు. మనం ముందుకు వెళుతూనే ఉండాలి. మన కొత్త తరాలు కూడా ఈ బాటలో పయనిస్తారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతోందని ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News