Saturday, November 23, 2024

ఉద్యోగాలను భర్తీ చేయలేవు.. చాట్ జిపిటి.. సహోద్యోగి వంటిది మాత్రమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చాట్ జిపిటి వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(కృత్రిమ మేధ) వేదికలు సహోద్యోగి(కోవర్కర్) మాత్రమే తప్ప, ఉద్యోగాల స్థానాన్ని భర్తీ చేయలేవని టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అభిప్రాయపడింది. టిసిఎస్‌లో ప్రస్తుతం 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటి దిగ్గజమైన టిసిఎస్‌కు సిహెచ్‌ఆర్‌ఒ(చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్) మిలింద్ లక్కడ్ ఎఐ టూల్స్‌పై స్పందించారు. చాట్ జిపిటి వంటి ఎఐ టూల్స్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదం చేస్తాయే కానీ, కంపెనీ వ్యాపార విధానాల్లో మార్పు రాదని అన్నారు. ‘జనరేటివ్ ఎఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహోద్యోగి. ఇది సహోద్యోగిలా కస్టమర్‌కు చెందిన అంశాలను అర్థం చేసుకునేందుకు ఇది సమయాన్ని వెచ్చిస్తుంది’ ఆయన అన్నారు.

ఉద్యోగంలో పనిచేయడానికి పరిశ్రమ, వినియోగదారు ప్రాధాన్యతలు ఉంటాయని, అటువంటి సహోద్యోగి పనిలో సహాయం పొందుతున్న మానవుడి నుంచి ఇది కొనసాగుతుందని ఆయన వివరించారు. ఇది ఉద్యోగాలను భర్తీ చేయదని, కానీ ఉద్యోగం అర్థాలు మారతాయని అన్నారు. చాట్ జిపిటి వంటి వేదికలు ఒక ఐటి సంస్థ క్లయింట్‌లకు అందించే పనికి శిక్షణ పొందిన మానవుడు అవసరమా? అనే విధంగా భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే అటువంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మొత్తం కోడ్‌లు రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద టెక్ కంపెనీల భారీ తొలగింపులకు ఒక కారణం ఇటువంటిప్లాట్‌ఫారమ్‌ల ఆవిర్భావమే అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News