Monday, December 23, 2024

స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు: తాతామనవళ్ల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మహోబా: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 66ఏళ్ల వృద్ధుడు, ఆయన మనవడు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సూటీని ఢీకొన్న ట్రక్కు రెండు కిలోమీటర్లకుపైగా ఈడ్చుకుపోయిందని అధికారులు తెలిపారు. మృతుడు నారాయణ చౌరాసియా రిటైర్డు టీచర్‌గా గుర్తించినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ పర్వేష్ రాయ్ తెలిపారు. చౌరాసియా తన ఆరేళ్ల మనవడితో కలిసి స్కూటీపై మార్కెట్‌కు వెళుతుండగా టర్నింగ్‌లో ప్రమాదం జరిగిందని రాయ్ తెలిపారు.

ట్రక్కు అడుగుభాగంలో స్కూటీ చిక్కుకుపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ట్రక్కును అడ్డుకోగా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని తరలించారు. ట్రక్కు డ్రైవరును అరెస్టు చేసి చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News