- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు, శ్రీనివాస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు శ్రీనివాస్‌కు వైద్యం అందిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం డిఎస్‌ను ఆరోగ్య పరిస్థితి వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం నేపథ్యంలో బిజెపి ఎంపి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని రెండు రోజుల పాటు తన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నానని వివరించారు.
- Advertisement -