హైదరాబాద్: కొందరు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఈ సంఘటన. జగిత్యాలకు చెందిన ఓ ప్రబుద్ధుడు జిల్లాలో కింగ్‌ఫిషర్ బీరు దొరుకతలేదని జిల్లా కలెక్టరుకే లేఖ రాసిండు. బీరమ్ రాజేశ్ అనే జగిత్యాల వాసి వైన్ షాపుల్లో కింగ్‌ఫిషర్ బీర్ దొరుకుతలేదని జిల్లా కలెక్టరుకే రాయడం ఇప్పుడు వార్తయి కూర్చుంది. ‘మద్యం అమ్మకాలకు అనుమతి పొందిన షాప్ ఓనర్లు ఇప్పుడు చౌక బీరులు మాత్రమే అమ్ముతున్నారు’ అని రాజేశ్ తన లేఖలో పేర్కొన్నాడు.
చాలా మంది ఆల్కాహాలిక్కులు కింగ్‌ఫిషర్ బీరు దొరకక చౌక రకం మద్యానికి అలవాటుపడుతున్నారన్నాడు. తమకు నచ్చిన బ్రాండ్ దొరకనప్పుడు మందుబాబులు దూరం వెళ్లి దాన్ని పొందే యావలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని కూడా ఏకరువు పెట్టాడు.
కింగ్‌ఫిషర్ బీరు దొరకనప్పుడు మందు బాబులు చౌక మత్తుపానీయాలకు మళ్లుతున్నారని, దాంతో వారు ‘యూరిక్ యాసిడ్’ రిస్క్‌ను ఎదుర్కొంటున్నారని కూడా తెలిపాడు. బెల్టు షాఫుల్లో కింగ్ ఫిషర్ బీరు లభిస్తోందని, కానీ రూ. 200 నుంచి రూ. 300కు ఇస్తున్నారని అతడు ఆరోపించాడు. బెల్టు షాపుల్లో అధిక ధరలకు కింగ్ ఫిషర్ బీర్ అమ్మడంపై రాజేశ్ విచారం వ్యక్తం చేశాడు.
జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు
కేఎఫ్ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల దనపు కలెక్టర్ బీఎస్ లతకు స్థానిక బీరం రాజేష్ వినతిపత్రం#Telangana #Jagtial #Hyderabad pic.twitter.com/MMnJUsJTZO
— Sagar KV 💙 (@SagarVanaparthi) February 27, 2023