Tuesday, April 29, 2025

మొదటి భార్యను మరువలేక.. ఆమె సమాధి వద్ద రైల్వే ఉద్యోగి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

జనగామ: భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జనగామా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడిని తాటి రాజు(40)గా గుర్తించారు. స్టేషన్ ఘన్ పూర్ లో రైల్వే ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. ఆరునెలల క్రితం భార్య చనిపోవడంతో రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య మరణాన్ని జీర్ణించుకోలేక బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News