Monday, December 23, 2024

ప్రేమను మాటల్లో వర్ణించలేము

- Advertisement -
- Advertisement -

కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌గా రాణించి బాలీవుడ్‌కు దూసుకెళ్లిన భామ రష్మిక మందన్న. ఈ అందాల తార తాజాగా ప్రేమ, తాను పెళ్లి చేసుకునే వాడికి ఉండాల్సిన లక్షణాలను గురించి చెప్పింది. “ప్రేమను మాటల్లో వర్ణించలేము. అది ఒక భావ వ్యక్తీకరణ మాత్రమే. ఒకరికి మరొకరు విలువైన సమయం, గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అది ప్రేమ.

ఇక నా వయసు చిన్నది కాబట్టి పెళ్లి గురించి ఏవిధంగా ఆలోచించాలో నాకు తెలియదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనని కూడా నా మనసులోకి రానీయలేదు. నన్ను సురక్షితంగా చూసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ” అని రష్మిక మందన్న చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News