- Advertisement -
సిటిబ్యూరోః ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దని తల్లిదండ్రులు మందిలించినందుకు మనస్థాపం చెందిన విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సైదాబాద్‌కు చెందిన విద్యార్థిని ధృవ(16) ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గపడుతున్నా కూడా బాలిక మొబైల్ ఫోన్‌లో నిత్యం గేమ్స్ ఆడుతోంది.
దీంతో తల్లిదండ్రులు గేమ్స్ ఆడవద్దని, చదువుకోవాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.
- Advertisement -