Friday, December 20, 2024

బిజెపి అంటే భారత జనులను పీడించే పార్టీ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు గ్యాస్ ధర పెంపును ఘట్‌కేసర్‌లో బిఆర్‌ఎస్ ధర్నా చేపట్టింది. నిరసన కార్యక్రమంలో వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. గ్యాస్ సబ్సిడీని బిజెపి పూర్తిగా ఎత్తివేసిందన్నారు.

గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే బిజెపి గగ్గోలు పెట్టిందని, సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బిజెపి పేదల నడ్డి విరుస్తోందన్నారు. ఎన్నికల తరువాత గ్యాస్ ధరలు పెంచడం అనవాయితీగా మారిందని హరీష్ రావు చెప్పారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై పది పైసలు తగ్గిస్తారన్నారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌పై వంద రూపయాలు పెంచుతున్నామని, బిజెపి అంటే భారత జనులను పీడించే పార్టీ అని చురకలంటించారు. నిండా ముంచిన బిజెపిని ముంచాలని ప్రజలు చూస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News