- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకై ఉమ్మడి పోరాటం చేద్దామని వైటిపి అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు వైటిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖలు రాశారు. అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామన్నారు. తెలంగాణలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు జరిగాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -