Saturday, November 23, 2024

అదానీ షేర్ల పతనంపై నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక నేపథ్యంలో సెబీ నిబంధనల్లోని సెక్షన్ 19 ఉల్లంఘనలు జరిగాయా, ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా స్టాక్ ధరలకు సంబంధించి అవకతవకలు జరిగాయా అన్న విషయాలపై దర్యాప్తు చేయాలని స్టాక్ మార్కెట్ నియంత్రణా సస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. జనవరి 24న వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై ఇప్పటికే సెబీ దర్యాప్తు చేస్తోందన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత దర్యాప్తు పరిధిపై తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయడంలేదని, రెండు నెలల్లో సెబీ తన దర్యాప్తు నివేదికను అందచేయాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది.

హిడెన్‌బర్గ్ నివేదిక విడుదలైన దరిమిలా అదానీ గ్రూపు షేర్ల ధరలు హఠాత్తుగా పతనమైన దృష్టా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన సూచలు చేపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే సారథ్యంలో ఒక నిపుణుల కమిటీనినియమిస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీలో ఓపి భట్, స్టిస్(రిటైర్డ్) జెపి దేవ్‌దత్, నందన్ నీలేకని, కెవి కామత్, సోమశేఖరన్ సెందరసన్ ఉన్నారు. నిపుణుల కమిటీ సీల్డ్ కవర్‌లో తన నివేదికను రెండు నెలల్లో సమర్పించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక కమిటీని నియమించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.. మొత్తం నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News