Friday, December 27, 2024

నా పొట్టలో కత్తెర ఎలా వచ్చింది: మహిళ పోరాటం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఒక మహిళ కడుపులో లభించిన స్టీల్ కత్తెర కేరళలో సంచలనం సృష్టిస్తోంది. గత ఏడాది ఆమె కడుపులో నుంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను సర్జరీ చేసి వైద్యులు తొలగించారు. అయితే..ఈ కత్తెర ఆమె కడుపులో ఎలా చేరిందో మాత్రం అంతుపట్టని మిస్టరీగా మారింది. కోజిక్కోడ్‌కు చెందిన హర్షిన అనే మహిళ 2017నవంబర్ 30న కోజిక్కోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ ద్వార మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలైంది. అనేక సార్లు వైద్యులను కలవడం, వారు ఏమీ లేదని చెప్పడం పరిపాటిగా మారింది. చివరకు ఆమె బాధ తభరించలేక కోజిక్కోడ్ వైద్య కళాభాల ఆసుపత్రి వైద్యులు ఆమెకు సిటి స్కాన్ నిర్వహించారు. అందులో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది.

తనకు సిజేరియన్ ఆపరేషన్ చేసినపుడు వైద్యులు కడుపులో కత్తెరను మరిచపోయారంటూ ఆమె ఫిర్యాదు చేయగా దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ఆసుపత్రి అటువంటి తప్పేదీ తమ ఆసుపత్రిలో జరగలేదని నివేదికలో తేల్చారు. ఆమె పోరాటం ఫలితంగా మరో నిపణుల కమిటీని కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ అందులో కూడా వైద్యులకు క్లీన్ చిట్ లభించింది. ఈ నివేదికలను బట్టి చూస్తే తానే ఆ కత్తెరను మింగినట్లు ఉందని హర్షిన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో వైద్య వ్యవస్థపైన, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జిపైన తనకు నమ్మకం పోయిందని ఆమె నిరసన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటానని ఆమె చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News