న్యూఢిల్లీ: ప్రతిపక్ష లెఫ్ట్-కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా ముందంజలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థులు త్రిపురలో విజయోత్సవ సంబరాలు ప్రారంభించారు. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు సగానికి పైగా స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు. అగర్తలలోని బిజెపి కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ బిజెపి కార్యకర్తల నినాదాలు మార్మోగుతున్నాయి.
స్వీట్లు పంచుతూ, బాణసంచ కాలుస్తూ కార్యకర్తలు సబంరాలలో మునిగిపోయారు. బిజెపి 28 స్థానాలలో ఆధిక్యతలో ఉండడంతోపాటు ఐదు స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షమైన ఐపిఎఫ్‌టి ఒక స్థానంలో గెలుపొందింది. ఐపిఎఫ్‌టికి చెదిన గిరిజనుల మద్దతుతో జేజిక్కించుకున్న తిప్ర మోత పార్టీ 10 స్థానాలలో ఆధిక్యతలో ఉండి రెండు స్థానాలు గెలుచుకుంది. లెఫ్, కాంగ్రెస్ కూటమి 14 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.
నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఎన్‌డిపిపి-బిజెపి కూటమికి అనుకూలగా ఉన్నాయి. ఈ కూటమి రెండు స్థానాలు గెలుపొంది 30 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఐదు స్థానాలలో ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉండగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదు స్థానాలలో ముందంజలో ఉన్నారు. రెండు స్థానాలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె), మూడు స్థానాలలో ఎల్‌జెపి(రాంవిలాస్ పాశ్వాన్) అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మేఘాలయాలో అధికార ఎన్‌పిపి ముందంజలో ఉంది.22 స్థానాలలో ఎన్‌పిపి ముందంజలో ఉండగా ఏడు స్థానాలలో యుడిపి ఆధిక్యంలో ఉంది. బిజెపి, కాంగ్రెస్ ఆరేసి స్థనాలలో ముందంజలో ఉన్నాయి. ఐదు స్థానాలలో తృణమూల్ కాంగ్రెస్, నాలుగు స్థానాలలో వాయిస్ ఆఫ్ ది పీసుల్ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ రెండు స్థానాలలో, ఇద్దరు ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు.