Sunday, January 19, 2025

తల్లి మందలించడంతో చెరువులో దూకి బాలిక ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంట్లో నుంచి అదృశ్యమైన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ రామంతపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…రామంతపూర్, ఇందిరానగర్‌కు చెందిన గుడివైన అనూష(19) ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే యువతి నీట్ పరీక్షపై అంత శ్రద్ధ చూపడంలేదు, దీంతో తల్లి సునీత ఎగ్జామ్‌పై దృష్టి సారించాలని మందలించింది. మనస్థాపం చెందిన యువతి బుధవారం తెల్లవారుజాము ఫోన్ ఇంట్లో పెట్టి చెప్పకుండా వెళ్లిపోయింది.

తెల్లవారి లేచి చూసేసరికి అనూష కన్పించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తెలిసిన వారందరినీ, అనూష స్నేహితులను ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. దీంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే రామంతపూర్ చెరువులో గురువారం అనూష మృతదేహం లభించింది. అనూష చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News