Sunday, January 19, 2025

మెస్మరైజ్ లుక్‌లో మహేశ్‌బాబు..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్ చూస్తుంటే ప్యాన్ ఇండియాకు చేరబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు. అయితే అందులో త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ న్యూ లుక్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో మహేష్ బాబు స్టన్నింగ్ న్యూ లుక్. గ్రీక్ గాడ్‌లా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తున్నారు. వెస్ట్, షార్ట్స్ ధరించి తన బైసప్స్ చూపించారు.

మహేష్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మహేష్ బాబు ఫిట్‌నెస్ ఫ్రీక్ అని చాలా మందికి తెలియదు. పర్ఫెక్ట్ ఫిజిక్‌ని మెంటైన్ చేయడానికి రెగ్యులర్‌గా జిమ్ చేస్తారని, తన బాడీని చక్కటి టోన్‌తో ఉంచుతారని ఈ ఫొటోను చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ చిత్రం కోసం మహేశ్ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కాగా, గురువారం తన ఫిటినెస్ ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ఈ చిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళితో ప్యాన్ వరల్డ్ చిత్రంలో నటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News