మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రణీన్ సత్తారు దర్శకత్వంలో ‘గాండివధారి అర్జున’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, వరుణ్ ఈ సినిమాతోపాటు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రపొందనున్న సినిమాలోనూ నటించనున్నాడు. ఇది వరుణ్ కు 13వ సినిమా. ఇందులో వరుణ్ పైలట్‌గా నటించనున్నాడు.
ఈ మూవీలో వరుణ్ కు జోడీ మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ నటించనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ తెలియజేస్తూ.. ఆమెకు సంబందించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో మానుషి ఛిల్లార్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మిస్తున్నారు. కాగా.. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు.
We are on a journey to celebrate the Pride & Glory of the IAF🇮🇳
Team #VT13 Welcomes Aboard @ManushiChhillar to join the force💥
Shoot Begins ❤️🔥
🌟ing @IAmVarunTej@ShaktipsHada89 @dophari @sidhu_mudda @nandu_abbineni @RenaissancePicz @khanwacky @sonypicsfilmsin @SonyPicsIndia pic.twitter.com/qraj5nEc5V
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 3, 2023