Saturday, November 23, 2024

ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని అనుమతించబోము: తమిళనాడు ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సున్నిత ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు అనుమతించబోమని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా మార్చి 5న తమిళనాడులో ఎలాంటి రూట్ మార్చిని నిర్వహించబోవడంలేదని ఆర్‌ఎస్‌ఎస్ సైతం సుప్రీంకోర్టుకు తెలిపింది. పైగా తమ ర్యాలీని వాయిదావేసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మాలనీ మార్చి 11 లేక 12 వరకు ఏమి చేపట్టబోవడంలేదని కోర్టుకు తెలిపారు.

తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి విచారణను మార్చి 17కు వాయిదా వేయమని కోరారు. ప్రతిపాదిత రూట్లను , ఇతర వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి ప్రతిపాదిత రూట్ మ్యాప్‌కు తామేమి వ్యతిరేకం కామని తమిళనాడు ప్రభుత్వం తెలుపడమేకాక, ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చిస్తామంది.

న్యాయమూర్తులు వి.రామసుబ్రమణ్యన్, పంకజ్ మిఠల్‌తో కూడిన ధర్మాసనం మార్చి 17కు విచారణను వాయిదావేసింది. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చికి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేసుకున్న అప్పీల్‌ను ఈ ధర్మాసనం విచారిస్తోంది. కాగా విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు ఫిబ్రవరి 10న వివిధ జిల్లాల్లోని పబ్లిక్ రోడ్లపై ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చిలకు అనుమతిని ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News