- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్లోకి వి27 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన వి27 సిరీస్‌లో వి27 ప్రో, వి27 వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇవి ఫ్లాగ్షిప్- స్థాయి హార్డ్వేర్, 3డి కర్వ్‌డ్ డిస్‌ప్లేతో పాటు ప్రీమియం ఫ్లోరైట్ ఎజి గ్లాస్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉన్నాయి.
వి27 ప్రో 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.37,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ .39,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ .42,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా, అన్ని రిటైల్ స్టోర్లలో ఫోన్లు లభ్యం కానున్నాయి. వి27 స్మార్ట్ ఫోన్ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.32,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.36,999గానూ ఉంది.
- Advertisement -