Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు ‘మహా’ ఆదరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మహారాష్ట్రకు చెందిన సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. మహారాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ విస్తరణకు తమ మద్దతు ఉంటుందని వారు కెసిఆర్‌తో పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో ఈ నెల 10వ తేదీన బిఆర్‌ఎస్ మద్ధతు సభ నిర్వహిస్తామని శంభాజీ బ్రిగేడ్ చెందిన నాయకులు కెసిఆర్‌కు తెలియచేశారు. సిఎంను కలిసిన వారిలో శంభాజీ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గేక్‌వాడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభా ష్ బోర్‌కర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రండి

తెలంగాణ మోడల్ మహారాష్ట్రకు అవసరమ ని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రా వాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బిఆర్‌ఎస్ పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం సవాల్ విసిరారు. ప్రస్తు తం మహారాష్ట్రలో ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులు, ప్రజలను ఓటు వేసే యంత్రాలు గా చూస్తున్నారే తప్ప ఆ ప్రజలకు సేవ చే యాలన్న ఆలోచనతో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తక్షణ విరుగుడు తెలంగాణ మోడల్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రంగాల్లో ప్రగతిపథంలో ప యనిస్తుందని శుక్రవారం మాణిక్ కదం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని వ్యవసాయ రంగం దేశ ముఖచిత్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సాగునీటి కష్టాలను కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిందన్నారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చించటానికి మహారాష్ట్రలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ చర్చకు రావటానికి వీలుకాకపోతే ప్రజాప్రతినిధుల క్షేత్ర పర్యటన సందర్భంగా బస చేసే ఖరీదైన హోటళ్లల్లో అయినా చర్చకు రావాలని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రకు తెలంగాణ మోడల్ అవశ్యమని ఈ విషయంలో ఎక్కడంటే అక్కడ చర్చకు తాను సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్రలోని అధికార బిజెపి నాయకులు సహా ఎవ్వరైనా తెలంగాణలోని వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి రావచ్చని, తెలంగాణలో క్షేత్ర స్థాయిలో చూసిన తర్వాత మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News