Monday, December 23, 2024

విద్య, వైద్యం లాభాల కోసం ఉపయోగించకూడదు: అశోక్ గెహ్లాట్

- Advertisement -
- Advertisement -

జైపూర్: విద్య, వైద్యం లాభాల కోసం ఉపయోగించవద్దని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం నొక్కి చెప్పారు. ఆరోగ్య హక్కు బిల్లుపై రాజస్థాన్ అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లు రాజస్థాన్ నివాసితులకు ఆసుపత్రులు, క్లినిక్కులు,లాబోరేటరీలలో ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే హక్కును కల్పించాలని కోరింది. ఇందులో ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయి. అయితే ఈ బిల్లును ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు, వైద్యులు వ్యతిరేకించారు.

ఈ నిరసనపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ఈ బిల్లు యొక్క ప్రాముఖ్యతను వివరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News