Monday, December 23, 2024

పిఆర్‌సి కోసం రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పిఆర్‌సి – 2022ను అమలు చేయాలని, ఈపిఎప్ నుండి జిపిఎఫ్‌గా మార్చాలని కోరుతూ శనివారం నాడు విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లంచ్ అవర్ డొమానిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎలక్ట్రిసిటి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈడబ్లూడబ్లూఏ) అధ్యక్షులు ఎం.జ్యోతిరాణి (డీఈ), ప్రధాన కార్యదర్శి ఎం. తులసి నాగరాణి (జిఎం)లు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పిఆర్‌సిని ప్రకటిస్తామని చెబుతూ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తాత్సారం చేస్తోందని, ఈ క్రమంలో తాము ఆందోళనకు దిగుతున్నామని చెప్పడంతోనే ప్రభుత్వం తమను తాజాగా చర్చలకు రండని పిలుస్తోందన్నారు.

తమ పిఆర్‌సి ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. పిఆర్‌సిపై పే రివిజన్ — 2022 అమలు చేయడంతో పాటు ఈపిఎఫ్ నుండి జిపిఎఫ్‌కు మార్చాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కాగా హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్ ఆధ్వర్యంలో మెట్రో జోన్ సిఎండి కార్యాలయం ముందు లంచ్ అవర్ డొమానిస్ట్రేషన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టిఎస్‌పిఈ జేఏసి సెంట్రల్, సౌత్ సర్కిల్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎస్‌పిఈజేఏసి ఛైర్మన్ సాయిబాబు మాట్లాడుతూ 2022 నుండి రావలసిన పిఆర్‌సి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈపిఎప్ నుండి జిపిఎప్ చేసి అన్ లిమిటెడ్ మెడికల్ సౌకర్యం ప్రతి కార్మికునికి కల్పించాలన్నారు. సంస్థలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మేనేజ్‌మెంట్ త్వరగా స్పందించి అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News