- Advertisement -
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులోగా పన్ను చెల్లింపుదారులు పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదాయపుశాఖ తెలిపింది. మార్చి ఆధార్‌పాన్‌కార్డు అనుసంధానం గడువు ముగియనుందని శాఖ వెల్లడించింది. గడువు ముగిసిన తరువాత ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డును కైవైసీగా ఆర్థిక లావాదేవీలకు అనుమతించమని ట్యాక్స్ అధికారులు తెలిపారు.
గడువులోపు పాన్‌ఆధార్ కార్డులను అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉన్నా ఉపయోగం ఉండదు. ఆధార్ కార్డు తెలియజేయకుంటే ఈ నెల పాన్‌కార్డు పనికిరాకపోగా ఇతరత్రా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)తెలిపింది.
- Advertisement -