- Advertisement -
మియాపూర్ ః చందానగర్ లో ప్రయాణిస్తున్న కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చందానగర్ నుండి మదీనగూడ వరకు టాటా ఇండిగో కారులో ఇద్ధరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా చందానగర్ సర్కిల్ కార్యలయం సమీపానికి రాగానే కారు ఏసి లోంచి ఒక్క సారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన కారులోని వక్తులు కిందికి దిగారు. ఇద్దరు కిందికి దిగిన సెకండ్ల వ్యవధిలోనే కారులో ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి.
సరైన సమయంలో కిందికి దిగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిండంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పాగా కారు పూర్తిగా మంటలకు కాలిపోయింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా చుట్టు ఉన్న చిరువ్యాపారుస్థులు భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -