Monday, December 23, 2024

నీటి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ /ఛండీగఢ్ : కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం పాటియాలా లో నీట్స్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మెడికల్ సైన్సెస్‌కు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాన్ని ఈ విధంగా ఓ కేంద్ర మంత్రి స్వయంగా సందర్శించడం ఇదే మొదటిసారి అని ఆరోగ్యమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రి మాండవీయ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అక్కడి ఏర్పాట్లపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతకు ముందు ఆయన పాటియాలా లోని కాళీదేవి మందిర్, గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 277 నగరాల్లో 902 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎస్‌బీ కోర్సులకు నిర్వహించే ఈ పరీక్షను మొత్తం 2,08,898 మంది రాస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

జీరోటాలరెన్స్ పాలసీలో భాగంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీలతో గట్టి నిఘా , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడంతోపాటు మొబైల్ ఫోన్ జామర్లను కూడా వినియోగించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఎన్‌బిఇఎంఎస్ ద్వారకా ఆఫీస్‌లో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షను పరిశీలిస్తున్నారు. దేశం లోని వివిధ పరీక్ష కేంద్రాల నుంచి కూడా ఈ కమాండ్ సెంటర్ లైవ్ దృశ్యాలను పరిశీలిస్తుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లో భాగంగా పోలీస్ చెక్‌పోస్ట్, మెడికల్ అసిస్టెన్స్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News