Friday, January 10, 2025

కాకిలా అరిచాడు.. వందలాది కాకులు వచ్చాయి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: నేటి ఇంటర్‌నెట్ యుగంలో టాలెంట్ ఉంటే చాలు ఏదో రకంగా పాపులర్ అయిపోవచ్చు. తమ అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న సామాన్యులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా.. కాకిలా అరిచి వందలాది కాకులను రప్పిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ట్రోల్స్ అఫిషియల్ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటికే లక్షమందికి పైగా వీక్షించారు. ఆ వ్యక్తికి క్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ఈ వీడియో వచ్చినట్లు తెలుస్తోంది. ఖాళీ మైదానంలో కొంతమంది వ్యక్తుల సమక్షంలో ఒక వ్యక్తి కాకిలా అరవడం..క్షణాల్లోనే మొదట ఒక కాకి ఆకాశంలో ప్రత్యక్షకావడం ఈ వీడియోలో చూడవచ్చు.

ఆ వ్యక్తి మరోసారి కాకిలా అరవగా వందలాది కాకులు ఆకాశంలో ఎగురుకుంటూ రావడాన్ని వీడియోలో చూడవచ్చు. క్షణాల్లో ఆ ప్రదేశమంతా కాకుల అరుపులతో గోలగోలగా మారిపోయింది. ఇదంతా ఎలా సాధ్యమంటారా&దీన్నే టాలెంట్ అంటారని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News