Monday, December 23, 2024

మనీష్ సిసోడియాకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మార్చి 20 వరకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడు రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో సిసోడియాను సిబిఐ అధికారులు సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఎదుట హాజరుపరచగా ఆయనకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం రద్దయిన 2021-2022 సంవత్సరానికి సంబంధించిన లిక్కర్ పాలసీ రూపకల్పనలో, అమలులో అవినీతి జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి సిసోడియాను సిబిఐ గత వారం అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News