- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిలో చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరులో కన్నుమూయగా, బచ్చుల అర్జునుడు కొన్నిరోజుల కిందటే మృతి చెందారు. ఈ నేపథ్యంలో, మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు.
- ఈ నెల 6(నేటి) నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో నామినేషన్ల స్వీకరణ
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు.
- అభ్యర్థి స్వయంగా గానీ, తన ప్రతిపాదకుడి ద్వారా గానీ నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం.
- వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో నామినేషన్ల దాఖలు. రిటర్నింగ్ అధికారి/ సహాయ రిటర్నింగ్ అధికారి/ శాసనమండలి ఉప కార్యదర్శికి నామినేషన్లు సమర్పించే అవకాశం.
- ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
- ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
- ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్. పోటీ ఉంటేనే ఎన్నికలు… లేకపోతే ఏకగ్రీవం అయినట్టు ప్రకటన.
- అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
- Advertisement -