- Advertisement -
న్యూస్ డెస్క్: రష్యాతో యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన తర్వాత ఉక్రెయిన్ నేలమట్టమైన తమ దేశంలోని ఒక పట్టణానికి చెందిన విషాదభరితమైన ఫోటోలను విడుదల చేసింది. డెనెట్‌స్కీ నగరానికి శివార్లలో ఉన్న మరింకా పట్టణానికి చెందిన ఈ ఫోటోలలో ఒక్క నివాస గృహం కూడా కనిపించకపోవడం విచారకరం. రష్యా యుద్ధం ప్రకటించడానికి ముందు దాదాపు 10, 000 జనాభాతో ప్రశాంతంగా ఉండే ఈ పట్టణం ఇప్పడు మరుభూమిగా మారిపోయింది. ఏడాది దాటినా ఇంకా కొనసాగుతున్న యుద్ధం సృష్టించిన బీభత్సానికి మరీంకా పట్టణమే నిప్రత్యక్ష నిదర్శనమంటూ ఉక్రెయిన్ ట్వీట్ చేసింది.
- Advertisement -