Monday, December 23, 2024

చట్టం ముందు అందరూ సమానమే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగేలా లిక్కర్ స్కామ్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జంతర్ మంతర్ ధర్నాకు నోటీసులకు సంబంధం లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. ఇడి వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించారని, నేడు మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అలినట్లు ఉందని చురకలంటించారు. నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చిన నాడు దేశంలో మహిళల కంటే పురుష జనాభా ఎక్కువ ఉండేది అది గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ బేటి బచావో.. బేటి పడావో అనే పథకం తీసుకు వచ్చారన్నారు. దాని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఆడబిడ్డలు విద్యను అభ్యసించే దిశగా పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గంలో మహిళల స్థానం పెరిగిందన్నారు. ఈరోజు దేశ రక్షణ రంగంలో వాయుసేన యుద్ధ విమానాల విభాగానికి ఒక మహిళ నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు. ఎంఎల్‌సి కవిత ఇడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రేపటి విచారణకు హాజరు కాలేనని కవిత స్పష్టం చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News