న్యూస్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో లడన్‌లోని ఛతమ్ హౌస్‌లో రాహుల్‌తో ప్రవాస భారతీయుల ముఖాముఖీలో లండన్‌కు చెందిన సిఇఓ మాలినీ నెహ్రా సంభాషణకు సంంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి కుమార్తెనని పరిచయం చేసుకున్న మాలినీ నెహ్రా భారత్‌లో ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన దేశ పరిస్థితి చూసి బాధపడుతున్నానని, ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిగా గర్వించే తన తండ్రి సైతం ప్రస్తుత భారతదేశాన్ని గుర్తించలేరని ఆమె అన్నారు. మన ప్రజాస్వామ్యానికి పూర్వవైభవం తీసుకురావడానికి తాము ఏమి చేయగలమని ఆమె రాహుల్‌ను ప్రశ్నించారు.
రాహుల్ బదులిస్తూ..మీ తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారని, ఆయన కూడా దేశాన్ని గుర్తించలేరని మీరు చెప్పడమే చాలా గొప్ప విషయమని అన్నారు. మీరు ఆ మాట చెప్పడం భిన్న ప్రభావం చూపగలదని ఆయన అన్నారు. మీరు ఏ విలువలకైతే కట్టుబడ్డారో అవి భారతదేశానికి చెందినవని, వాటినే మీరు కాపాడుకుంటున్నారని, భారతదేశం తిరిగి ఆ విలువల వైపు సాగాల్సిన ఆవశ్యకతను మీరు ప్రంచానికి చెప్పారని రాహుల్ అన్నారు. ఈ వీడియోను రాహుల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ భారత దేశ మౌలిక విలువల గురించి, మన ప్రజాస్వామ్యాన్ని పరిరిక్షంచుకోవలసిన ఆవశ్యకత గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడు మాట్లాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
It is the duty of every Indian, everywhere in the world, to speak up for India’s core values and protect our beloved democracy. pic.twitter.com/MQQweHkch4
— Rahul Gandhi (@RahulGandhi) March 7, 2023