Sunday, December 22, 2024

మోత్కూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిసిపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు పోలీస్ స్టేషన్ ను బుధవారం యాదాద్రి డిసిపి ఎం.రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. కానిస్టేబుళ్ల ఫిట్ నెస్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, సిబ్బంది కిట్ల వాడకం తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు, రికార్డులు తనిఖీ చేశారు. గ్రామాల్లో పెట్రోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని, దొంగతనాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, సిపి కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలతో పాటు నేరస్తులు, రౌడీ షీటర్ల సమాచారం పై ఆరా తీశారు. సిబ్బంది పనితీరు, క్రైం రివ్యూ చేసి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇయర్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా మోత్కూరు స్టేషన్‌ను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పని సరిగా ఉండాలని, లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేస్తామన్నారు. రామన్నపేట పోలీస్ సర్కిల్ దూరమవుతుందని, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాలతో మోత్కూరును పోలీస్ సర్కిల్ చేసే అవకాశం ఉందా అని అడగ్గా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు. సిబ్బంది క్వార్టర్స్ శిథిలావస్థకు చేరిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామన్నపేట సిఐ మోతీరాం, ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి ఆయన వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News