Friday, November 22, 2024

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

- Advertisement -
- Advertisement -

అమెరికా పర్యటనలో ప్రవాసులకు మంత్రి కొప్పుల పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని సంస్థలను సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. అమెరికా పర్యటనలో గత వారం రోజులుగా బిజి బిజీగా గడుపుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పనెన్స్ సిటీలో బిఆర్‌ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి తోడుగా ప్రైవేటు రంగంలోనూ యువతకు అమెరికాలోని సంస్థలు సహకరిస్తే మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పదిరోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటికే సాల్ట్ లేక్ సిటీలోని ఎస్‌డిఎస్ హ్యూమానిటేరియన్ సెంట్రల్ వేర్‌హౌస్ రూట్స్ టెక్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులతోనూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News