Monday, December 23, 2024

అవార్డుల కంటే ఆ పేరే నాకు సంతృప్తినిస్తుంది..

- Advertisement -
- Advertisement -

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ’కనుల చాటు మేఘమా’ పాటకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి.

ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇటువంటి సందర్భంలో వచ్చిన ప్రేమ పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. శ్రీనివాస్ అభిరుచికి తగ్గట్లుగా స్వరపరచడం జరిగింది. కేవలం ట్యూన్ మాత్రమే కాదు.. లక్ష్మీభూపాల్ రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ఎంతో నచ్చాయి. ఈ పాట హిట్ అవ్వడంలో వాళ్ళ ప్రమేయం చాలా ఉంది. రూపుదిద్దుకుంటున్నప్పుడే ఈ పాట హిట్ అవుతుందని నాకు తెలుసు.

ఈ సినిమాకు నా సంగీతం, నా పాటలు బాగున్నాయి అని ప్రశంసలు దక్కాయి. నేను స్వరపరిచిన పాటలు పాడిన వారికి అవార్డులు వచ్చాయి. కానీ ఎందుకనో నాకు అవార్డులు రాలేదు. ఈ సినిమాకి లిరిక్ రైటర్‌గా లక్ష్మీభూపాల్, సింగర్ గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం ఉంది. అయితే అవార్డులు కంటే కూడా నా పాట బాగుందనే పేరే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News