Saturday, December 21, 2024

బొట్టు పెట్టుకోని మహిళపై బిజెపి ఎంపి చిందులు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: నుదట కుంకుమ బొట్టు పెట్టుకోని ఒక మహిళపై బిజెపికి చెందిన కర్నాటకలోని కోలార్ ఎంపి ఎస్ మునిస్వామి మండిపడ్డారు. వెంటనే కుంకుమ పెట్టుకోవాలంటూ ఆమెను ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం కోలార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనశాలను ఎంపి మునిస్వామి సందర్శించారు.

ఈ సందర్భంగా ఒక స్టాల్‌లో కూర్చున్న మహిళను ఎంపి పలకరించారు. నీ పేరంటని ఆమెను ప్రశ్నించగా సుజాత అని ఆమె బదులిచ్చింది. నుదట కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ఆమెను ఎంపి ప్రశ్నించారు. నీ స్టాల్‌కు వైష్ణవి అని ఎందుకు పేరు పెట్టుకున్నావు..వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకో..నీ భర్త బతికే ఉన్నాడా లేదా..ఎవరైనా డబ్బులిస్తే చాలు వేరే మతంలోకి మీరు మారిపోతుంటారు..అంటూ ఎంపి ముని స్వామి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిజెపి ఎంపి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News