Friday, December 20, 2024

పవిత్రను పెళ్లి చేసుకున్న నరేష్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ప్రవిత-నరేష్ తాజాగా పెళ్లి చేసుకున్నారు.  పవిత్రను పెళ్లి చేసుకున్నానని నరేష్ తన ట్వీట్టర్‌లో వీడియో విడుదల చేశారు. గత కొంత కాలంగా పవిత్ర-నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడుఅడుగులతో కలిసి ఉంటామని మీ ఆశీస్సులు కావాలని తన ట్విట్టర్‌లో నరేష్ ట్వీట్ చేశారు. నరేష్- పవిత్ర పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేటు వయస్సులో ఘాటు ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు విమర్శలు చేస్తుండగా కొందరు మాత్రం ప్రేమకు వయసుతో పని లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. నరేష్‌కు నాలుగో పెళ్లికాగా పవిత్రకు ముచ్చటగా ఇది మూడో పెళ్లి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News