Friday, November 22, 2024

టి20 లీగ్‌లతో క్రికెట్‌కు ముప్పు: ఎంసిసి

- Advertisement -
- Advertisement -

లండన్: కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌ల ఆధిపత్యం కనిపిస్తోందని, దీని ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌తో సహా పలు దేశాల్లో టి20 లీగ్‌ల ఆధిపత్యం స్పష్టంగా ఉందని.. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాల భవితవ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడింది. ఐపిఎల్, బిగ్‌బాష్, దక్షిణాఫ్రికా, కరీబియన్ లీగ్, బంగ్లాదేశ్ లీగ్, పాకిస్థాన్ లీగ్‌లతో అంతర్జాతీయ క్రికెట్ మనుగడ సవాల్‌గా మారిందని పేర్కొంది. లీగ్‌ల మోజులో పడి ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌పై ఆసక్తి చూపడం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ప్రపంచ క్రికెట్ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వెలిబుచ్చింది.

ఇప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు, టోర్నీలు జరిగేలా చూడాలని సలహా ఇచ్చింది. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న వివిధ లీగ్‌లతో ఐసిసి భవిష్యత్తు ప్రణాళిక కార్యాచరణ (ఎఫ్‌టిపి) భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ క్రమంగా పెరుగుతోందని, దీని ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూలింగ్‌కు ప్రమాదం పొంచి ఉందని ఎంసిసి ఆవేదన వ్యక్తం చేసింది. బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి అసన్నమైందని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News