ఢిల్లీ: మద్యం అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2021లో మద్యం దుకాణాలను ప్రైవేటీకరణ చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీని మొత్తం 32 జోన్లుగా విభజించి 849 లిక్కర్ షాపులను ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించింది. ఒక్కో జోన్లో దాదాపుగా 27 మద్యం దుకాణాలు ఉండే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. దీని ద్వారా ఖజానాకు రూ.9500 కోట్ల ఆదాయం వస్తుందని కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో వివరించింది. ఢిల్లీ లెప్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజల్ రెండు నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న మద్యం షాపులో ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్‌లు ఇవ్వొచ్చని, వైన్ షాపులు లేని చోట మాత్రం ఢిల్లీ డెవలప్‌మెంట్ ఆథారిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలని లింక్ పెట్టారు.
డిడిఎ, ఎసిడిలను అనుమతి తీసుకోకుండా ఇష్టారీతిన లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు ధరల నిర్ణయం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతోనే ఈ స్కామ్ బయటపడింది. తెల్లవారుజామున మూడు గంటల వరకు లిక్కర్ షాపులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. డ్రై డేలను 21 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించారు. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజులో రాయితీలు, పీజు మాపీ చేయడం వంటివి తన నివేదికలో రాగానే సిబిఐ విచారణ చేయాలని గవర్నర్ సిపార్సు చేశారు. కోవిడ్ సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం దాదాపుగా రూ. 144 కోట్లు ఫీజు మాఫీ చేసింది. విదేశీ బీర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు 50 శాతం చొప్పున రాయితీ ఇచ్చినట్టు నివేదికలో ఉన్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడుగా ఉన్న విద్యా, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.