Friday, December 20, 2024

కవితను ప్రశ్నిస్తున్న ఇడి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఇడి అధికారులు విచారిస్తున్నారు. ఆమె వెంటన భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. కవితకు మద్దతుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఇడి కార్యాలరయం వద్దకు చేరుకున్నారు. ఇడి కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తుగ్లక్ రోడ్డులోని కెసిఆర్ నివాసం నుంచి పది వాహనాలలో ఇడి ఆఫీస్‌కు కవిత చేరుకున్నారు. తొమ్మిదో తారీఖున రావాల్సి ఉండగా 11న విచారణకు హాజరవుతానని కవిత వివరించారు. కవితను విచారిస్తుండడంతో ఇసి ఆఫీస్ చుట్టు పక్కల భారీ భద్రత ఏర్పాటు చేశారు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకొని పలువును న్యాయవాదులతో చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News