Saturday, November 16, 2024

దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ల టీ స్టాల్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే(ఎన్‌ఎఫ్‌ఆర్) దేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్‌జెండర్ల ఆధ్వర్యంలో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. గువాహటి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ట్రాన్స్‌జెండర్ల టీ స్టాల్ ప్రారంభమైంది. ట్రాన్స్‌జెండర్(హిజ్రాలు) వర్గాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక టీ స్టాల్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గువాహటి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ ఒకటిపై ట్రాన్స్ టీ స్టాల్‌ను ఎన్‌ఎఫ్‌ఆర్ జనరల్ మేనేజర్ అంశుల్ గుప్తా ప్రారంభించారు.

అస్సాం ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు అసోసియేట్ వైస్ చైర్మన్ స్వాతి బిధాన్ బారువా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతీయ రైల్వేలలోనే ఇది తొలి అడుగుగా గుప్తా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కూడా ఇదే తొలి ప్రయత్నమని ఆయన చెప్పారు. తమ పరిధిలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇటువంటి టీ స్టాల్స్ ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News