Monday, December 23, 2024

దేశంలో రైతు సమస్యలకు పరిష్కారం లేదు: పోచారం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ఇటివల దేశంలో జరుగుతున్న సంఘటనలు మన దేశం ఇతర దేశాల ముందు తల వంచుకునే విధంగా ఉన్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ఆర్ అండ్ బి అథితి గృహంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాములు పాలించిన రామరాజ్యం పతనమవుతుందని, దేశంలో రైతుల సమస్యలకు పరిశ్కారం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని కేవలం అదానికి మాత్రమే దేశ ప్రజలకు కాదని అన్నారు.మోడీ అంటే ఈడి, ఈడి అంటే మోడీ అన్నట్టు దేశంలో ఉందని చెప్పారు.రాజకీయాలు పక్కన పెట్టి దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని అన్నారు.

ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల పైననే ఈడి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని దేశ విదేశాలకు తెలిసేలా చేసిన ఎమ్మెల్సీ కవిత ను 9 గంటలు ఈడి విచారణ జరుపడం సరైనది కాదని పేర్కొన్నారు. బండి సంజయ్ ఒక తల్లికి పుట్టి ఉంటే ఈ విధంగా మాట్లాడడని సభాపతి పోచారం అన్నారు. ఈ రకంగా మాట్లాడటం మాతృమూర్తిని అవమానించడమేనని అన్నారు. జాగ్రతగా ఉండండి అందరికీ చీము నెత్తురు ఉన్నాయని హెచ్చరించారు. మా సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరుపరని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, రాష్ట్ర ఉర్ధూ అకాడమి చైర్మన్ ముజీబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News