Friday, December 20, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్..ఇంటి దొంగ పనే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)లో కంప్యూటర్ హ్యాకింగ్ కలకంగా మారింది. ఈ లీకేజీ వ్యవహారంలో టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగి ప్రవీణ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, టిఎస్ పిఎస్‌సి ఉన్నతాధికారి సిబ్బందే రూ. 10 లక్షలకు ఆశపడి దళారులతో కలిసి టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష పేపర్లను లీకేజీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి పిఎ ప్రవీణే ఈ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిసున్నారు. ప్రవీణ్ తోపాటు ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంబజార్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రవీణ్ ల్యాప్‌టాప్ ను స్వాధీనం చేసుకుని, మరింత సమాచారం కోసం పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ముగ్గురు దళారులతో కలిసి ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీ కోసం దళారులతో ప్రవీణ్ రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చు కున్నట్లు భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు దళారులకు టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ తోపాటు ఆ ముగ్గురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక, ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన పలువురిని కూడా అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ అభ్యర్థి బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
రెండు పరీక్షలు రద్దు : దీంతో ఆదివారం జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అభ్యర్థులకే ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం చేరవేశామని అధికారులు తెలిపారు. వెంటనే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News