Friday, December 20, 2024

‘ఇదేం’ డైనమిజం?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తి ధరల పెంపుదలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు తన డైనమిజాన్ని చాటుకుంటోం ది. వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు భిన్నంగా ధరల పెంపుదలతో అన్ని వర్గాల ప్రజలనుంచి ఎడాపెడా దండుకుంటోం ది. పెట్రోల్ డీజిల్‌పై ధరలు పెరుగుతున్నంత వే గంగా దేశంలో మరేవీ పెరగడం లేదు. కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌ను ప్రజల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసుకునే భారీగా ఆదాయ వనరుగా మార్చుకుం ది. అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉన్న బం గారం ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మోడీ పాలనలో ‘తగ్గేదేలా’ అన్నంత ధీ మాగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు పెట్రోల్ ,డీ జిల్ ధరలు మార్చుకునేలా 2017నుంచి దేశంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమల్లోకి తెచ్చిన మోడీ సర్కారు అంతర్జాతీయంగా క్రూడ్ మార్కెట్‌తో సంబంధం లేకుండానే దేశంలో ధరలను పెంచు తూ పోతోంది.

ఒక్క ఏడాది (200122)లోనే పె ట్రోల్ ధరలు 78సార్లు, డీజిల్ ధరలు 76సార్లు పెంచిందంటే దేశంలో ఇంధన వినియోగదార్లనుంచి ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ముక్కుపిండి ఖజా నా నింపుకునేందుకు ఎంత శ్రద్ధ్ద చూపిస్తోందో స్ప ష్టమవుతోంది. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునేందుకో .. లేదా ప్రజలనుంచి కేంద్రం మీద ఉన్న వ్యతిరేకత మంటలను చల్లార్చేందుకో అవసరాన్ని బట్టి నామమాత్రంగా స్వల్పకాలం ధరలు తగ్గింస్తుంది. పదిసార్లు ధరలు పెంచితో ఒక్కసారి మొక్కుబడిగా పె ట్రోల్ డీజిల్ ధరలు తగ్గుస్తుంటుంది. 2014 పె ట్రోల్ ధర లీటరు రూ.71.41 ఉండేది. కేంద్ర ప్ర భుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ప్రతి లీటరుకు రూ.10.70 పన్నుగా చేరిపోయేది. బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రధాని సారథ్యంలో పెట్రోల్ ధర లీటరు రూ.71.41నుంచి 2015లో లీటరు ధర రూ.74.12కు పెంచింది. ఎక్సైక్ సుంకం కూడా రూ.12.95కు పెంచింది. ఇక అప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతోంది.

2021నాటికి లీటరు పెట్రోల్ రూ.114.49కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్సైజ్ సుంకం రూపంలో తనకు రావాల్సిన పన్నుకూడా రూ.32.98కి పెంచుకుంది. కొవిడ్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. ప్రజల రాబడి తగ్గింది. ప్రాణాలతో బతికితే చాలు అన్నంతగా భయపడిపోయిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా క్షీణించాయి. దేశ ప్రజలపై ఏమాత్రం కనికరం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అదే అదనుగా భావించి పెట్రోల్ సుంకం లీటరుకు రూ.19.98నుంచి ఏకంగా రూ.32.98కి పెంచుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురుకు డిమాండ్ పడిపోయి బ్యారెల్ 77 డాలర్ల నుంచి 65 డాలర్లకు పడిపోయినా, ఇక్కడ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై ఏమాత్రం జాలి లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఎక్సైజ్ సుంకాన్ని దండుకుంది.

రూ. 2.13లక్షల కోట్లనుంచి రూ.4లక్షల కోట్లకు పెరిగిన రాబడి:

కొవిడ్ సృష్టించిన బీభత్స భయానక పరిస్థితులనుంచి దేశ ప్రజలు పూర్తిగా కోలుకోకముందే ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పన్నుల బాదుడుపై మేలుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోయి వాటి విక్రయాల ద్వారా ఎక్సైజ్ రాబడిని వందశాతం పెంచుకుంది. జిఎస్టి అమల్లోకి వచ్చాక పెట్రోల్ ,డీజిల్ , విమాన ఇంధనం , సహజవాయువు విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వసూలు చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా పెట్రోల్ ,డీజిల్ విక్రయాల ద్వారానే సింహభాగం ఆదాయం సమకూర్చుకుంటోంది. దేశంలో పెట్రోల్ , డీజిల్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం ద్వారా 201819లో రూ.2.13లక్షల కోట్లు రాబడి సమకూరింది. 202021నాటికి ఇది రూ.3.35లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఆర్థ్దిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ విక్రయాల ద్వారా పన్నుల కింద రూ.4లక్షల కోట్లు రాబడిని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాలకు చేరువ కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంపై 2కోట్ల భారం :

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ ధరలు లీటరుకు రూపాయి పెంచితే వాహన దారులపై కోట్లు అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో 3520పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు కోట్ల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి.అందులో డీజిల్ 1.40లక్షల లీటర్లు విక్రయం జరుగుతుండగా, పెట్రోల్ అమ్మకాలు 60లక్షల లీటర్లు ఉన్నట్టు పెట్రోలియం సరఫరా కంపెనీ అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతిమంగా ప్రజలపైనే భారం!

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలతో అంతిమంగా అన్ని వర్గా ప్రజలపైనా భారం మోపుతోంది. ఇటు ధరల పెంపు ..అటు ఎక్సైజ్ పన్నుల రూపంలో నరేంద్రమోడీ సర్కారు రెండుచేతులా ప్రజలనుంచి దండుకుంటోంది. పెట్రోల్, డీజిల్ పెరిగితే సరుకుల రవాణాకు సంబంధించిన బాడుగులు పెరిగిపోతున్నాయి. కూరగాయలు ,పాలు మొదలుకుని ఇతర నిత్యావసర సరులు ధరలపైనా రవాణా చార్జీల భారం పడుతోంది. ప్రయాణ చార్జీలు పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకులు , ఆహార పదార్ధాలు, దుస్తులు, ఔషధాలు, మొదలుకుని ప్రతినిత్యం వినియోగించే అన్ని రకాల వస్తువులు , వస్తుసేవలపైనా ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది. అంతిమంగా అమ్మ కడుపులో ఉన్న బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాచిన పండు ముదుసలి దాకా అన్ని వయసుల వారికి , అన్ని వర్గాల ప్రజలకూ కేంద్రం పన్నుల సెగ తగులుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News