Monday, December 23, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే ఎంఎల్‌సి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 29720 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 15,472 మంది పురుషులు, 14,246 మంది స్త్రీలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఈ ఎన్నికకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నిక కోసం 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News