Monday, December 23, 2024

కన్నడలోనే మాట్లాడాలి.. మహిళతో ఆటో డ్రైవర్ వాగ్వాదం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భాషాభిమానంలో తమిళులు, కన్నడిగులను మించినవారు లేరన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా కర్నాటకలో ఇటీవల వెలుగుచూసిన ఒక తాజా సంఘటనను చెప్పవచ్చు. కన్నడలోనే మాట్లాడాలని ఒక ఆటోడ్రైవర్, తాను కన్నడ మాట్లాడనంటూ ఒక ప్రయాణికురాలు.. తమ మాతృభాష కోసం వీరిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అనానిమస్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయగా ఇప్పుడది వైరల్ అవుతోంది. ఉత్తర భారతీయులు.. బిచ్చగాళ్లు.. మా భూమి, వంటి పదాలను ఆటో డ్రైవర్ ఉపయోగించాడు.. ఇది ఈ ఆటో డ్రైవర్ మెంటాలిటీయే కాదు.. తాము కర్నాటక వారమని చెప్పుకోవడానికి వీరంతా గర్వపడుతున్నారు. కన్నడ మాట్లాడాలంటూ ఇతరులను బలవంతపెడుతున్నారు అంటూ ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ అనానిమస్ తన పోస్టులో కామెంట్ చేశారు.

కన్నడ భాషలోనే మాట్లాడాలంటూ ఆటోడ్రైవర్ ప్రయాణికురాలిని మందలించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నువ్వు కన్నడలోనే మాట్లాడాలి.. ఇది మా భూమి.. మీ భూమి కాదు అంటూ ఆటోడ్రైవర్ ఆమెతో వాగ్వాదానికి దిగడం వీడియోలో కనిపించింది. ఆ ప్రయాణికురాలు మాత్రం అతనితో వాగ్వాదం కొనసాగించారు. కన్నడలో మేము మాట్లాడము అంటూ ఆమె అనడాన్ని చూడవచ్చు. ఈ వీడియోను ఇప్పటివరకు 18,000 మందికిపైగా వీక్షించారు. ఈ వాగ్వాదం కర్నాటకలో జరిగిందని అర్థమవుతున్నప్పటికీ కచ్ఛితంగా ఏ ఊరిలో జరిగిందో మాత్రం నిర్ధారణ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News