ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంటు(ఎన్‌బిడబ్లూ) జారీ అయింది. ఖాటూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సెషన్స్ జడ్జి సోమవారం ఎన్‌బిడబ్లూ జారీ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్ వాస్తవానికి సోమవారం ప్రకారం కోర్టులో హాజరుకావాలి. కానీ ఇమ్రాన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా కారణాల రీత్యా పిటిషన్లో తెలిపారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం రెక్షూస్టువారెంటును జారీ చేసినట్లు జియో న్యూస్ వెల్లడించింది.
గతేడాది ఆగస్టులో ఇమ్రాన్‌ఖాన్ రాజకీయ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగిస్తూ జడ్జి జెబాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆమెపై తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించడంతో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తిని బెదిరించారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్‌లు 186(ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం)తోపాటు 188, 504, 506 ప్రకారం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తన తప్పును అంగీకరించారు. జడ్జికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.